తెలంగాణకు ప్రియాంక గాంధీ

Spread the love

ప్రియాంక గాంధీకి తెలంగాణ బాధ్యతలు ఇస్తారా?

హైదరాబాద్ :
కొంతమంది రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్లు. ప్లేట్స్ తిప్పేయడంలో వాళ్లకు తిరుగుండదు. నిన్నటివరకూ ఓ పార్టీతో ఉండే వాళ్లు.. ఇవాళ మరో పార్టీకి వంతపాడగలరు.

రేపు ఇంకోలా సీన్ క్రియేట్ చెయ్యగలరు. అలాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో..

తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. దాంతో… ఇదివరకు కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి.. బీజేపీలోకి జంప్ అయిన కొందరు నేతలు..

ఇప్పుడు మళ్లీ హస్తం షేక్‌హ్యాండ్ కోసం చూస్తున్నారు. ఇదీ తమ బ్రాండ్ అంటోంది కాంగ్రెస్.

మొన్నటిదాకా తెలంగాణలో బీఆర్ఎస్, మధ్య ప్రధాన పోటీ ఉన్న అంచనాలు కనిపించాయి. ఇప్పుడు సీన్ మారింది.

బీఆర్ఎస్, వర్సెస్ కాంగ్రెస్‌గా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితం.. కాంగ్రెస్‌లో మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా… జాగ్రత్తగా వ్యవహరిస్తే..

కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఆ పార్టీలో పెరిగింది అంటున్నారు. అందువల్ల ఇష్టమొచ్చినట్లు కాకుండా.. సిస్టమేటిక్‌గా, అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ ఉండాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతను AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే.. ఈమధ్య ప్రియాంక గాంధీ ఒకరోజు తెలంగాణకు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా… ప్రజలు, కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

అందువల్ల పూర్తిగా ఆమెకు బాధ్యతలు అప్పగిస్తే రిజల్ట్ అదిరిపోతుందనే అభిప్రాయంలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు తెలిసింది.

కర్ణాటకలో రాహుల్ గాంధీ 17 సభల్లో పాల్గొనగా… ప్రియాంక గాంధీ 20 సభలు, రోడ్ షోలు చేశారు. వీళ్లిద్దరూ రొటీన్‌గా ప్రచారం చేసుకుపోకుండా… వాస్తవాలకు దగ్గరగా ప్రసంగాలు చేశారు.

బీజేపీ ప్రభుత్వంపై ఆధారాలతో విమర్శలు చేస్తూ… అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేసేదీ.. కచ్చితమైన గ్యారెంటీ హామీలతో ప్రచారం చేశారు.

ఇది ప్రజలకు నచ్చింది. నమ్మకం కలిగింది. ఇదే విధంగా తెలంగాణలో కూడా చెయ్యాలి అనే డిమాండ్.. అక్కడి నేతల నుంచి వస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రైతులు, ముసలివారి మద్దతు ఉంటోంది. ఈసారి యువత, మహిళలు కూడా సపోర్ట్ ఇచ్చారు.

కారణం.. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్. అలాగే.. గృహలక్ష్మీ, గృహజ్యోతి, ఆర్టీసీలో మహిళలకు ఉచితప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ప్రజలకు నచ్చాయి.

తెలంగాణలో కూడా ఇలాంటి హామీలను గ్యారెంటీ కార్డుతో ఇవ్వడం ద్వారా అధికారంలోకి రావచ్చనే అభిప్రాయం హస్తం వర్గాల నుంచి వస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఎక్కువే. PCC చీఫ్ రేవంత్ రెడ్డితో చాలా మందికి పడట్లేదు.

కానీ ప్రియాంకగాంధీ వస్తే.. అన్నీ సర్దుకుపోతాయనే అభిప్రాయం ఉంది. నేతలంతా హైకమాండ్ పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారు కాబట్టి…

ప్రియాంక గాంధీ అందర్నీ ఒకే తాటిపై నడిపించగలరని భావిస్తున్నారు.

అదే జరిగితే.. ప్రజల్లో ఆ పార్టీ పట్ల సదభిప్రాయం కలుగుతుంది. అది కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వగలదు.

ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్‌లో కసరత్తు జరుగుతోంది.

ఆచరణ సాధ్యమయ్యే హామీలతో మేనిఫెస్టో ఉండాలనీ.. అదే సమయంలో.. అన్ని వర్గాలకూ హామీలు ఇచ్చేలా డిక్లరేషన్ రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏం చేసినా… టైమ్ తక్కువ ఉంది. అక్టోబర్‌లో ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు టాక్. అంటే… 5 నెలలే టైమ్ ఉంది.

అధికారంలోకి రావాలంటే.. తక్కువ టైమ్‌లో కాంగ్రెస్ చాలా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు….

3,495 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?