
షర్మిల పై కేసు నమోదు
ఖైరతాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అఫిడవిట్ రిలీజ్ చేసినందున బీఆర్ఎస్ కార్యకర్త నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 2 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2), 504 కింద కేసు నమోదు చేశారు.
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది.
టిఎస్‌పిసి నిర్వహించిన పరీక్షలో ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై షర్మీల విలేకరుల సమావేశంలో, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు షర్మిలపై ఐపిసి సెక్షన్లు 505(2), 504 కింద కేసులు పెట్టారు. ఇంకా ఫిర్యాదులో బిఆర్‌ఎస్ పార్టీని ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’ అని వ్యాఖ్యానించారని కూడా పేర్కొన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి సోదరి. ఆమె ప్రభుత్వ వైఫల్యంపై రాసిన అఫిడవిట్‌పై కెసిఆర్ సంతకం పెట్టాలని కూడా డిమాండ్ చేశారు.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పత్రం లీక్ కావడంపై షర్మిల చిందులు తొక్కుతున్నారు.
టిఎస్‌పిఎస్‌సికి చెందిన ఇద్దరు ఉద్యోగులు పరీక్ష పత్రాలు దొంగిలించారని, ఆ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు అమ్ముకున్నారని ఆరోపణ.
2,691 Views