SSB పోలీసు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్…

Spread the love

పోలీసు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు! అప్లై ఎలాగంటే?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర సాయుధ బలగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. సెంట్రల్​ ఆర్మెడ్​ పోలీస్​ ఫోర్స్​లో ఉన్న ఎస్​ఎస్​బీ విభాగంలో 1656 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ వెలువరించింది.

ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దానికి సంబంధించిన అర్హతలు, వయో పరిమితి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్(SSB)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్​ ట్రేడ్స్​మెన్​, సబ్​ ఇన్​స్పెక్టర్​, అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​, హెడ్​ కానిస్టేబుల్​ పోస్టుల నియామకానికి కేంద్రం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 1656 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్​లైన్​లో మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 1656
అసిస్టెంట్​ కమాండెంట్​(వెటర్నరీ): 18
వెటర్నరీ సైన్స్​ అండ్​ యానిమల్​ హస్బెండరీలో డిగ్రీ చేసి​.. 23 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్​ ఇన్​స్పెక్టర్​(టెక్నికల్​): 111
సబ్​ ఇన్​స్పెక్టర్​ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే వారు తప్పని సరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు.

అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ (పారామెడికల్​ స్టాఫ్​): 30
ఈ పోస్ట్​కు అప్లై చేయాలనుకునేవారు ఇంటర్​తో పాటుగా సంబంధింత విభాగంలో డిప్లొమా చేసి సర్టిఫికేట్​ కలిగి ఉండాలి. వయస్సు 20 నుంచి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ (స్టెనో): 40
18 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న ఇంటర్​ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ స్టెనో పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.
హెడ్​ కానిస్టేబుల్​(టెక్నికల్​): 914
హెడ్​ కానిస్టేబుల్​ పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవాలంటే.. పదో తరగతితో పాటుగా సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికేట్​ కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
కానిస్టేబుల్​(ట్రేడ్స్​మెన్​):546
పదో తరగతి ఉత్తీర్ణులై.. 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు కానిస్టేబుల్​ పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్​లైన్​
ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: మొదట రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి.. అప్లై చేసుకున్న పోస్టును బట్టి ఫిజికల్​ టెస్ట్​లు ఉంటాయి. ఈ రెండు దశల్లో విజయం సాధించిన వారితో మెరిట్ జాబితా తీసి.. సర్టిఫికేట్​ వెరిఫికేషన్​, మెడికల్​ టెస్ట్​ల ఆధారంగా ఉద్యోగంలోకి చేర్చుకుంటారు.
ఆన్​లైన్​లో దరఖాస్తు ప్రారంభం: 2023, మే 25
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 2023, జూన్​ 24
పరీక్ష తేదీలను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. దీనికోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు SSB అధికారిక వెబ్​సైట్​లో​ చెక్​ చేసుకోవాలి.

1,666 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?