
మాజీ సర్పంచ్ పై హత్యాయత్నం
నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బూరిగారి వెంకట్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
వెంకట్ రెడ్డి సర్పంచ్‌గా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్‌లో భాగంగా గుడిసెను పోగొట్టుకున్న శ్రీనివాస్ మాజీ సర్పంచ్‌పై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో శ్రీనివాస్ తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో వెంకట్‌రెడ్డి గొంతు కోసే యత్నం చేశాడు.
ఈ ఘటనలో వెంకట్ రెడ్డి మెడతో పాటు చేతివేలికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యే గన్‌మెన్, పోలీసులు దాడికి పాల్పడ్డ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడ్డ నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు.
దాడిని ఖండించిన శ్రీకాంత్ గౌడ్
ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ..ఎన్నో సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజా సేవకునిగా పనిచేస్తున్న, మాజీ సర్పంచ్‌పై ఇలా దాడి జరగడం బాధాకరమన్నారు.