
మందుబాబులకు షాక్..
హైదరాబాద్‌లో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదు
దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదై మందు బాబులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్ అశ్విని హాస్పిటల్లో ఆల్కహాల్( మద్యం) ఎలర్జీ కేసు నిర్ధారణ అయింది.
ఇప్పటి దాకా ప్రపంచంలోని 100 కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఢిల్లీ ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ అలర్జీ జరిగినట్లు డాక్టర్ లు గుర్తించారు.
కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ కాని పరిస్థితి ఉన్నదని అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు.
36 సంవత్సరాల ఆగ్రా ప్రాంతానికి చెందిన జాన్, తన మిత్రులతో కలిసి రిసార్ట్ కి వెళ్లి పార్టీలో పాల్గొన్నాడని ..కబుర్ల అనంతరం అందరూ కలిసి మద్యాన్ని సేవించారని తెలిపారు.
అందరితో పాటు తన గ్లాస్ లో ఉన్నా మద్యాన్ని తాగిన జాన్, సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత, తన శారీరికమైన మార్పులు కనుక్కున్నాడని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
ముఖమంతా ఎర్రబడి వేడిగా మారడం, చర్మంపై దురదలు రావడం, చాతి బరువుగా ఉండటం, ఆయాసంగా అనిపించడం, మైకం లాగ రావడం జరిగిందన్నారు.