
డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి
మహబూబాబాద్ పీహెచ్సీలో బాలింత మృతి.. బంధువుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామంలో డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి చెందిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.
బాలింత మృతికి కారణమైన డాక్టర్ రవిని సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికార పార్టీ నాయకులు అండదండలతో తమను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ విలేజ్ కి చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మి (25) మే 15 మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి నార్మల్ డెలివరీ చేశారు.
గతంలో ఒక బాబు ఉండగా ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చింది భాగ్యలక్ష్మి. డెలివరీ సమయంలో చిన్న ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు.
అయితే బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఎమర్జెన్సీ కేసుగా నిర్ధారించి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి అంబులెన్సులో తరలించారు.
అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ నిర్ధారించడంతో మృతురాలి బంధువులు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.
డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఇవాళ మరోసారి ఖమ్మం వరంగల్ హైవేపై ఆందోళనకు దిగారు.
రాష్ట్రంలో నార్మల్ డెలివరీలు బాలింతల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా జరుగుతోన్న ఘటనలు కలవరపెడుతున్నాయి.
కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గత 15 రోజుల్లో ముగ్గురు శిశువులు, ఒక బాలింత చనిపోయారు.