
కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
12 మంది ప్రాణం తీసిన నకిలి మద్యం, సీఎం సీరియస్, ప్రభుత్వానికి చాలెంజ్ గా !
మద్యం మత్తులో ఊగుతున్న మందు బాబులు అతిగా మద్యం సేవించారు. ప్రభుత్వ దుకాణాల్లో కాకుండా అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యం పీకలదాక తాగేశారు.
నకిలి మద్యం సేవించడంతో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అక్రమ మద్యం తయారు చేస్తున్న నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మరక్కనం సమీపంలోని ఎక్కియార్ కుప్పం ఏరియాలో నకిలి మద్యం సేవించిన ఆరు మంది ఆదివారం చనిపోయారని స్థానిక అధికారులు ఏఎన్ఐ మీడియాకు తెలిపారు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతగంలో నకిలి మద్యం సేవించి శుక్రవారం ఇద్దరు, ఆదివారం ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు.
నకిలి మద్యం సేవించిన చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు అంటున్నారు.
అక్రమ మద్యం తయారు చేసి విక్రయించి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన ఇద్దరిని అరెస్టు చేమశాని సీనియర్ పోలీసు అధికారి కన్నన్ మీడియాకు చెప్పారు.
అక్రమ మద్యం తయారు చేస్తున్న నిందితులు అందరిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నామని ఉత్తర విభాగం డీఐజీ కన్నన్ స్థానిక మీడియాకు చెప్పారు.
ఎథనాల్ ఎక్కువగా ఉపయోగించి నకిలి మద్యం తయారు చెయ్యడం వలనే అమాయకులు బలి అయ్యారని, తప్పు చేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టమని సీనియర్ పోలీసు అధికారి కన్నన్ తెలిపారు.
నకిలి మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక్కొక్కరిని రూ. 50 పరిహారం అందిస్తామని, నకిలి మద్యం తయారు చేసి విక్రయిస్తున్న
వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ అన్నారు. నకిలి మద్యం సేవించి మరణించిన కుటుంబాలకు సీఎం ఎంకే. స్టాలిన్ సానుభూతి ప్రకటించారు.