
షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు షాపుల దగ్ధం
నిజామాబాద్ నగరంలో షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు షాపులు దగ్ధం అయ్యాయి.
ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. నగరంలోని బాబన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలో రోడ్డు వైపు ఉన్న స్క్రాప్ షాప్, మటన్ సెంటర్, చికెన్ సెంటర్, హోటల్ కాలిపోయాయి.
కరెంట్ షాక్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు.
అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పి వేశాయి.
రోడ్డు ప్రక్కన చిన్న షాపులను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు అగ్నిప్రమాదం కారణంగా రోడ్డున పడ్డారు.
తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
294 Views