
ప్రియురాలిని కలవడానికి వచ్చిన ప్రియుడి కిడ్నాప్
చార్మినార్ : యువతిని కలవడానికి వచ్చిన ఓ ప్రేమికుడిని కిడ్నాప్ చేసి రెండు గంటల పాటు చితక బాదిన ఘటన రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెయిన్ బజార్ ఇన్ స్పెక్టర్ రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం… ఎల్ బీనగర్ కు చెందిన కార్తీక్ (19) యాకుత్ పుర లో మరో వర్గానికి చెందిన ఓ యువతిని కలవడానికి గురువారం రాత్రి వచ్చాడు.
విషయం తెలుసుకున్న స్థానికంగా ఉన్న కొంతమంది యువకులు కార్తీక్ ను కిడ్నాప్ చేసి పక్కనే ఉన్న నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి తీసుకు వెళ్లారు.
అక్కడ రెండు గంటల పాటు నిర్భందించి చితక బాదారు. అనంతరం అతన్ని వదిలి పెట్టారు.
తీవ్ర గాయల పాలైన యువకుడు రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసులు నమోదు చేసుకుని రెయిన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. ఈ కేసును రెయిన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.