
ఎమ్మెల్యే హరిప్రియ వాహనాన్ని అడ్డుకున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కేంద్రంలో కోదండరామస్వామి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు .
20 రోజులు ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం పోసి అకాల వర్షాలకు హరి గోస పడుతున్నామని తడిసిన ధాన్యం పేరుతో మంచిగా ఉన్న ధాన్యం మార్క్ ఫెడ్ అధికారులు మొక్క జొన్న , వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు సెంటర్లో రైతులను అధికారులు చీత్కారం గురి అవుతున్న మీకు పట్టింపు లేదా..
కొనుగోలు కేంద్రంలో మంచి నీరు కూడా లేదని , నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మీకు ఆత్మీయ సమ్మేళనం ముఖ్యమా రైతుల గోడు పట్టదా అంటూ అక్కడికి వచ్చిన నేతల ముందు ప్రశ్నించారు .
అనంతరం రైతులు ఎమ్మెల్యే ముందు తమ గోడును విన్నవించారు. ఎమ్మెల్యే కు రైతుల డిమాండ్ తో కూడిన వినతి పత్రం అందించారు .
ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేస్తామని , ఆత్మీయ సమ్మేళనం అనంతరం మీ వద్దకు వస్తానని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన విరమించారు .
రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో మండల రైతులు చుట్టు పక్కల రైతులు , లక్ష్మి , మల్సూరు . నారాయణ రెడ్డి, పోలవరపు శ్రీను , తదితరులు పాల్గొన్నారు .