
వైన్ షాపులో నిల్… బెల్ట్ షాపులో ఫుల్…
నయా దందా లో వైన్ షాపు యాజమాన్యం….
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు…
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో గల వైన్ షాపులో కొత్త తరహాలో దందా నడుస్తుంది…
అసలే ఎండాకాలం అటుపై భానుడి ప్రతాపం ఎండలో తిరిగి అలసి వస్తున్న మద్యం ప్రియులు చల్లటి బీరు తాగుదామని వైన్ షాప్ కి వెళితే అక్కడ చేదు అనుభవం ఎదురవుతుంది.
వైన్ షాపులో బీర్లు దొరకవు బెల్టు షాపులో ఉంది అక్కడ పోయి తాగండి అనే సమాధానం వినిపిస్తుంది సరేనని బెల్ట్ షాపులకు ఆశ్రయించగా 160 రూపాయల గల బీరు 210 అంటూ విక్రయిస్తున్న వైనం గూడూరు మండలంలో ఏర్పడింది.
బెల్టు షాపు యజమాన్యాన్ని వివరణ కోరగా మాకు వైన్ షాప్ యజమాన్యం వారే 170 రూపాయల చొప్పున విక్రయించగా మేము 210 కు విక్రయిస్తున్నట్లు సమాధానం ఇచ్చారు.
బోనకల్లు మండలంలో బోనకల్లు గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల వెలుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
బెల్ట్ షాపులో ఫుల్ బాటిల్ మందును విక్రయించకూడదు. ఈ నిబంధనను తుంగలో తొక్కి బెల్టు షాపులో ఫుల్ బాటిల్ అధిక మొత్తంలో మందును విక్రయిస్తూ అధిక సొమ్మును కాజేస్తున్న వైనం వివిధ గ్రామాలలో ఏర్పడుతుంది.
ఇకనైనా స్థానిక అధికారులు స్పందించి వైన్ షాపు నియమ నిబంధనల ప్రకారం మద్యం విక్రయించేలా బెల్టు షాపులను అరికట్టేలా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.