
గ్యాస్ సిలిండర్ పేలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..
ఏదో ఓ చోట గ్యాస్ లిండర్ లీక్ అవుతూనే ఉన్నాయి. గ్యాస్ లీక్ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టే షన్ పరిధిలోని దుర్గానగర్ గ్యాస్ సిలెండర్ పేలింది.
ఈ ఘటన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దర్గానగర్ లో ఉంటున్న అస్మతి కుమారి అనే మహిళ బుధవారం ఉదయం వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆమె బయటకు పరుగులు తీశారు.
సిలిండర్ పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో పాటు ఇంటి గోడలు కూలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
మంగళవారం సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్ల లోడ్ తో వెళ్తోన్న ఆటోలో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయినట్లు ఆటో డ్రైవర్ గమనించాడు.
వెంటనే అతను ఆటోను రోడ్డుపై వదిలి పెట్టి దూరంగా వెళ్లిపోయాడు. ఆటో వెనకల వస్తున్న వాహనదారులు కూడా గ్యాస్ లీకైనట్లు తెలుసుకుని వారి వాహనాలను నిలిపి దూరంగా వెళ్లిపోయారు.
దీంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
సిలిండర్ గ్యాస్ లీకైన సమయంలో ఆటోలో 12 పెద్ద సిలిండర్లు ఉన్నాయి. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి లీకైన గ్యాస్ సిలిండర్ సరిచేశారు.
మిగతా సిలిండర్లను కిందకు దింపారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్రమబద్ధికరించారు. ప్రమాదం తప్పడంతో అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే సిలిండర్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో సిలిండర్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని చెబుతున్నారు. గ్యాస్ లీక్ అయి అనేక మంది చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి.
2017లో 309 సిలిండర్లు పేలాయి. 315 చనిపోగా.. 84మంది గాయపడ్డారు. 2018లో 307 సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యాయి. 318 చనిపోగా.. 41 మంది గాయపడ్డారు. 2019లో 314 ప్రమాదాలు జరగ్గా.. 330 మంది చనిపోయారు. 59 మంది గాయపడ్డారు. 2020లో 245 సిలిండర్లు బాంబుల్లా పేలాయి.
మృతుల సంఖ్య 254గా ఉంది. మరో 66 మంది గాయపడ్డారు. గ్యాస్ బండల భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, లీకేజీలపై ఏమరుపాటు ప్రాణాలు తీస్తున్నాయని అందుకే జాగ్రత్తగా ఉండాలన్నారు.
వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం,గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది.