
జూనియర్ పంచాయతీ కార్యదర్శు ల సమ్మైపె ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని, లేకుంటే తొలగిస్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటికే ఆ ఉత్తర్వు కాపీని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సందేశ రూపంలో అందజేశారు. అ యితే తమ సమస్య పరిష్కారానికి తగ్గేదే లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు స్పష్టం చేస్తున్నా రు.
జిల్లా కేంద్రంలో విడతల వారీగా ఆందోళన క్యా క్రమాలు నిర్వహిస్తామంటున్నారు.
జేపీఎస్‌లు రా ష్ట్రవ్యాప్తంగా గత నెల 28 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. జిల్లాలో 421 మంది జూ నియర్ పంచాయతీ కార్యదర్శులు, ఓజేపీఎస్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం ప్రభు త్వం రాత పరీక్ష ద్వారా వీరి నియామకాలు చేపట్టింది.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా వీరి మూడేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్ 2022 ఏప్రిల్ 11 నాటి కే పూర్తయ్యింది.
అయితే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రొబేషన్ కాలాన్ని మరో ఏడాది పొడగించారు. 2023 ఏప్రిల్ 11 నాటికే ఏడాది కూడా ముగిసింది.
ఎలాంటి సానుకూల నిర్ణయం రాకపోవడంతో రా ష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏప్రిల్ 13న సమ్మె నోటీసు ప్రభుత్వానికి అందజేశారు.
15 రోజుల నోటీస్ కా లం తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లారు. ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఆర్డర్ కాపీని ఇప్పటికే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వాట్సాప్, టెలీగ్రామ్, ఇతర మార్గా ల్లో అందజేశామని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ తెలిపారు.
కాగా ఉద్యమం తీవ్రం చేస్తామని త్వరలోనే భవిష్య త్ కార్యాచరణ ను ప్రకటిస్తామని చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న జేపీఎస్‌లతో నగరంలోని ధర్నా చౌక్‌లో వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.
నోటీసులపై జేపీఎస్ అసోసియేషన్ సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పట్టువీడాలని సీనియర్ల సూచన..
జేపీఎస్‌లకు ప్రభుత్వం అల్టీమేటం జారీచేయడంతో పలువురు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ నోటీసులతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
సమ్మె విరమించాలని వారి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్, సీనియర్లు కూడా పట్టువీడాలని సూచనలు చేశారు.
మరోవైపు ప్రభుత్వ నోటీసులతో ఎంతమంది జేపీఎస్‌లు విధుల్లో చేరుతారనేది ఉత్కంఠ నెలకొంది.