
చిన్నోళ్లపైనే వేధింపులు.. పెద్దొళ్ల జోలికెళ్లరూ…
బోలెరోలు, ట్రాక్టర్ల పట్టివేత..,
మంజీరాలో ఉన్న లారీలు కన్పించని వైనం
ముట్టచెప్పితే చాలు…,
అధికార పార్టీ నాయకులు చేసింది అంతా రైట్
అడిగింది ఇవ్వని వాహనాలే టార్గెట్..?
ఇది మంజీరాలో అక్రమ ఇసుక రవాణాలో అధికారుల తీరు..?
నిజామాబాద్: వారి దృష్టిలో చట్టం అందరికీ ఒక్కటే కాదండోయ్… అధికారం ఉన్నోళ్లు తప్పు చేసిన ఆ శాఖ అధికారుల దృష్టిలో అంతా రైట్: గానే ఉంటుంది.
అదే ఓ చిన్న వాడు తనకు తెలియక తప్పు జరిగిన పెద్ద కేసులు పెడతారు ఆ సార్లూ.., చిన్నోళ్లపై వేధింపులకు పాల్పడుతూ.. పెధ్దళ్ల జోలికి మాత్రం వెళ్లరూ సుమా…? ఇది ఎక్కడో కాదండీ.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద మండలాల మంజీరా నదిలో అక్రమ ఇసుక నడిపిస్తున్నా అధికారుల తీరండి. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు ప్రదర్శిస్తున్న తీరుపై ప్రత్యేక కథనం.
వాటినే.. పట్టుకున్నారు…
సోమవారం రాత్రి బీర్కూర్ మండలాల మంజీరా, నుంచి అక్రమ ఇసుక తరలిస్తుందనే ఫిర్యాదులు భారీగా వెళ్లడంతో పోలీసులు తెల్లవారు జామున దాడులు చేశారు.
ఇందులో టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్కు తరలించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., అదే మంజీరాలో పదుల సంఖ్యలో లారీలు ఉన్నా.. అధికారులు లోపలి వెళ్లి వాటిని ఎందుకు సీజ్ చేయలేదో…? ఆ అధికారులకే తెలియాలి మరీ. ఇలాంటి ఘటనలు అధికారులు తీరుపై అనుమానాలు రేకెతుతున్నాయి.
ప్రజలను అరెస్టు చేస్తారటా…?
బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామ మంజీరా నుంచి మంగళవారం జీరో వాహనాలు నడుపుతున్నారనీ పలువురు అడ్డుకున్నామని, పోలీసులకు సమాచారం అందిస్తే ఘటన వద్దకు వచ్చి అడ్డుకుంటే అరెస్టులు
చేస్తామని అడ్డుకున్న వారినే బెదిరిస్తున్నారని పుల్కల్ గ్రామానికి చెందిన పలువురు ఆవేధన వ్యక్తం చేశారు.. జీరో బండ్ల సంగతి మాత్రం ఆ అధికారులు అక్కడ మాట్లాడటం లేదని వారు ఆరోపించారు.
దీనిని బట్టి చట్టం అందరికీ ఒకేలా అమలు అనేది ఆచరణలో కన్పించడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఇదండీ అక్రమ ఇసుక రవాణాల అధికారులు తీరుతో ప్రజలు బహిరంగంగానే వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అందరికీ చట్టం ఒక్కటే అనేలా చర్యలు తీసుకునేలా లేదో వేచి చూడాల్సిందే.