
నీట్ పరీక్ష నిబంధనలపై పేరెంట్స్ ఫైర్.. ఇవేం రూల్స్ అంటూ..
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడం మొదలుపెట్టారు. అయితే అంతకు ముందు నీట్ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవేం రూల్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కు పుడకలతో ఉన్న బాలికలను పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది గేట్ల వద్దే నిలిపివేశారు. ముక్కు పుడక తీసేయాని లేదంటే లోపలికి రానివ్వమని చెప్పడంతో వాటిని గతిలేక విద్యార్థులు తీసేసి లోపలికి వెళ్లారు. కొందరు విద్యార్థులు రాకపోవడంతో తల్లిదండ్రులు ముక్కుపుడకను కట్ చేశారు. అలాగే ఫుల్ హ్యాండ్స్ వున్న, గాజులు వేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే ఆపేశారు.
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల హెయిర్ బ్యాండ్లు, గాజులు తొలగించి లోపలికి అనుమతించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం అప్లికేషన్‌తో పాటు ఆధార్ కార్డు మాత్రమే అనుమతించబడుతుంది.
ఇలా కాగా కఠిన నిబంధనలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిఇలా ఉంటే మరోవైపు నీట్ పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆలస్యం అవుతోంది. దీంతో విద్యార్థులు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.
నీట్ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికే విద్యార్థులు ఎలా రావాలని ముందుగానే చెప్పినా స్టూడెంట్స్ అలా రావడం పై సెక్యూరిటీ సిబ్బంది మండిపడ్డారు.
ఇలా రాకూడదని అప్లికేషన్ లోనే చెప్పినా అయినా విద్యార్థులు రూల్స్ పాటించకుండా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించకుండా అధికారుల సమయాన్ని వృధా చేశారని తీవ్రంగా మండిపడ్డారు.
ఇక NEET పరీక్షకు ఓ విద్యార్థికి నిరాశ ఎదురైంది. భీంసరి శివారులోని ఆర్యభట్ట హైస్కూల్ లో సెంటర్ ఈఘటన జరిగింది. ఆలస్యం కావడంతో పరీక్షకు సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఏం చేయలేక కన్నీటితో విద్యార్థి వెనుతిరిగాడు.
నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో, విదేశాలలో 14 నగరాల్లో నిర్వహించబడుతుంది.
ఏపీలో 140 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌లో 22 కేంద్రాల్లో నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది.
ఉదయం 11:40 గంటల నుంచి విద్యార్థులను లోనికి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.