
చెట్ల పొదల్లో మహిళ మృతదేహం.. అసలేమైదంటే?
వరంగల్ జిల్లా సంగెం మండలంలో పళ్లారుగూడ శివారు వంజరపల్లి గ్రామానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో
గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై భరత్ క్లూస్ టీంతో వచ్చి వివరాలు ఆరా తీసుస్తున్నారు.
మహిళ ముఖంపై తీవ్ర గాయాలున్నాయి. తలపై దాడి చేసి అనంతరం చున్నీతో ఉరివేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదే విషయంపై సీఐ శ్రీనివాస్‌ను దిశ వివరణ కోరగా మహిళ ఎవరన్నది తెలియాల్సి ఉందని తెలిపారు.
ప్రస్తుతం క్లూస్‌టీం ఆధారాలు సేకరించే పనిలో ఉందని వెల్లడించారు. స్థానికురాలు కాలేదని తెలుస్తుండగా, హత్య మరోచోట జరిగి ఉంటుందని,
అనంతరం ఇక్కడ మృతదేహాన్ని వదిలివెళ్లినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
3,187 Views