
రెజ్లర్ల పోరాటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీల సంఘీభావం
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంపీలు సంఘీభావం తెలిపారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్షాస్థలికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపిల బృందం. రెజ్లర్ బజ్ రంగ్ పునియను కలిసి సంఘీభావం తెలియజేశారు.
మంత్రిశ్రీనివాస్ గౌడ్ తోపాటు పాటు బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు జంతర్ మంతర్ కు వెళ్లిన వారిలో ఉన్నారు.
మహిళా రెజ్లర్సును వేధింపులకు గురి చేసిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బ్రిజ్ భూషణ్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.