
పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడై కాటేస్తున్నాడు
కర్ష రత్నకుమారి మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మే 05,
భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లో చైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని పై అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అతను అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెడుతూ నన్ను బావ అని పిలువు అని వేధిస్తూ పాతిక సంవత్సరాలు ఉన్న ఉపాధ్యాయుడు నిండు 14 ఏళ్ళు కూడా లేని ఆరవ తరగతి బాలికను వేధిస్తూ మనోవేదనకు గురి చేస్తూ ఎవరికి చెప్పుకోలేక చివరికి అతని శాడిజం తట్టుకోలేక చివరకు తల్లిదండ్రులకు చెప్పుకున్న కథనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినది
ఈ విషయం తెలుసుకున్న సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహిళా సమాఖ్య, పి డి ఎస్ యు విద్యార్థి సంఘ నాయకురాలు మంజుల, అక్కడికి వెళ్లి ప్రిన్సిపల్ ని వివరాలు తెలుసుకోగా అతనిని కాలేజీలో నుండి తీసివేసినట్లుగా అతనిపై ఫోక్సో కేసు పెట్టి ఎఫ్ ఐ ఆర్ అయినట్లుగా చెప్పడం జరిగినది,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చేర్చుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం యాజమాన్యానికి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం పై ఉండడం లేదని ఉపాధ్యాయుడికి కావలసిన బీఈడీ క్వాలిఫై లేని ఉపాధ్యాయులను తక్కువ జీతాలకు పెట్టుకొని సరియైన విద్యను అందించగ పోగా మ్యానర్స్ లేని ఉపాధ్యాయులను పెట్టుకొని పిల్లల భవిష్యత్తు తో చెలగాటమాడుతున్న పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కూళ్లపై కాలేజీలపై యాజమాన్యుల లైసెన్సులు రద్దు చేయాలని అలాగే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ వారిని డిమాండ్ చేస్తున్నాము
అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని ఆలస్యం చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్వహించి అతనిని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య నుండి డిమాండ్ చేస్తున్నాము ,
అలాగే స్కూల్ లలో పిల్లలకు నెలకు రెండు, మూడు, సార్లు ఎవర్నస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ పై ఉందని హెచ్చరిస్తున్నాము
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కరీష రత్నకుమారి, విద్యార్థి సంఘ నాయకురాలు,. ‘ పి డి ఎస్, యు విద్యార్థి సంఘ నాయకురాలు మంజుల, వెంకటలక్ష్మి .భాగ్యలక్ష్మి, షమీం మ్
రామ టాకీస్ ధనలక్ష్మి,, తదితరులు పాల్గొన్నారు