తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలి
బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆసుపత్రి ఎదుట బాలుడి కుటుంబికులు శుక్రవారం ఆందోళన చేశారు.
తిరుమలగిరి సాగర్ మండలం సపవత్ తండా కు చెందిన మధు కార్తీక్(2) జ్వరం రాగా ఈనెల 29 న మిర్యాలగూడ డాక్టర్ కాలనీలో ఉన్న స్టార్ పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు.
బాలున్ని పరీక్షించిన వైద్యులు టైఫాయిడ్, మలేరియా లక్షణాలు ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తరలించాలని భయపెట్టారు.
దీంతో బాలుడు తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి పరీక్షించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం మిర్యాలగూడ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.
తప్పుడు రిపోర్ట్ ఇచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ట్లు ఆరోపిస్తూ వైద్యశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.