
నగరంలో గోనెసంచుల్లో డెడ్ బాడీల కలకలం…
హైదరాబాద్ లోని గాంధీనగర్ లో మంగళవారం రాత్రి పోలీసులు ఓ గోనె సంచిని కనుగొన్నారు. ఇందులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈమె వయసు 30 నుంచి 35 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఊరి చివర్లో చెత్తకుప్పు.. ఆ కుప్పలో ఓ గోనె సంచి.. మొదట్లో అదేదో పడేసిన వస్తువు అనుకున్నారు.. కానీ కొన్ని రోజుల తరువాత దుర్వాసన రావడం మొదలైంది..
ఆ తరువాత చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు గోనె సంచి తెరిచి చూడగా.. షాకింగ్ దృశ్యం.. ఇదేదో సినిమాలోని సీన్ కాదు.
హైదరాబాద్ శివారులో జరిగిన యదార్థ ఘటన. ఈ భయానక దృశ్యాన్ని చూసిన పోలీసులు ఆ తరువాత దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఇదొక్కటే కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనే. అలసేంటీ గోనె సంచల కథలు?
హైదరాబాద్ లోని గాంధీనగర్ లో మంగళవారం రాత్రి పోలీసులు ఓ గోనె సంచిని కనుగొన్నారు. ఇందులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
ఈమె వయసు 30 నుంచి 35 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళను అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదే రోజు షాద్ నగర్ లోనూ ఇలాంటి ఘటనే. ఓ గోనె సంచి.. అందులో మహిళ మృతదేహం. రోడ్డు పక్కన పొదల్లో ఉన్న దీనిని పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.
వెంటనే ఈ ఘటన వివరాలు సేకరించారు. దేవకి అనే మహిళ నుంచి రాములు-శారద అనే దంపతులు లక్షన్నరకు ఓ బాలుడిని కొనుగోలు చేశారు. అయితే దేవకి అదనంగా డబ్బు డిమాండ్ చేసింది.
లేదంటే పిల్లాడిని వెనక్కిఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో జరిగిన గోడవతో రాములు, అతని భార్య కలిసి దేవకిని హత్య చేసిన గోనె సంచిలో కుక్కినట్లు పోలీసులు కేసును ఛేదించారు.
గత కొన్ని నెలలుగా ఇలాంటి ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏ మూల నుంచి ఎటువంటి విషయం వినిపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసి గోనె సంచుల్లో కుక్కి బయట పడేస్తున్నారు. గాంధీనగర్లో దొరికిన మృతదేహం కు సంబంధించినవివరాలు ఇప్పటికీ తెలియరాలేదు.
ఇప్పటికైనా ఇలాంటి విషయాలపై దృష్టి సారించకపోతే క్రైం రేట్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు.