ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తాం!

Spread the love

ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తాం!

-ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కేసీఆర్ కుటుంబం కుట్ర

-విలువైన ఆస్తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లీజు పేరిట దోచిపెడుతున్నారు

-ఆర్టీసీని వ్యూహాత్మకంగానే దివాళా తీయిస్తున్నారు

-ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

-ఉద్యోగులారా…. తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపండి

-కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేదాకా పోరాడదాం రండి

-సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకమై పోరాడండి

-మీకు అండగా బీజేపీ ఉంది….

-5 నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

-తొలగించిన ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకుంటాం

-బడ్జెట్ లో ఆర్టీసికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం

-ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకురావడంతోపాటు అందులో పనిచేయడం స్టేటస్ గా తీర్చిదిద్దుతాం

-ఓవైసీపై కేసీఆర్ కున్న ప్రేమకు చిహ్నమే నూతన సచివాలయ నిర్మాణం

-కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆ ప్రేమకు రాయబారులు

-దళిత బంధులో కమీషన్లు తీసుకుంటున్న వారిపై చర్యలేవి?

-ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని లబ్దిదారులకు పంచాల్సిందే

-కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

-ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశానికి హాజరై భరోసా ఇచ్చిన బండి సంజయ్

ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కేసీఆర్ కుటుంబం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అందులో భాగంగా విలువైన ఆస్తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లీజు పేరిట దోచిపెడుతున్నారని చెప్పారు.

ఆర్టీసీని వ్యూహాత్మకంగానే కేసీఆర్ దివాళా తీయిస్తూ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ‘‘ఉద్యోగులారా…. తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపండి. కేసులు పెట్టినా, ఉద్యోగాల నుండి తొలగించినా భయపెడకండి. మీకు అండగా మేమున్నాం. రోడ్లపైకి వచ్చి కొట్లాడండి.

ఉద్యోగాల నుండి తొలగిస్తే 5 నెలలు లాంగ్ లీవ్ పెట్టామనుకోండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. వెంటనే తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటాం’’అని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ (బీఎంఎస్) ఆధ్వర్యంలో కాచిగూడలో ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, బీఎంఎస్ రాష్ట్ర నాయకులు రాంమోహన్, వెంకట్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మనోహర్ రావు, స్వామికుమార్, శోభన్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• ఆర్టీసీ కార్మికుల వెనుక నేను అండగా ఉంటా. కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల దమ్మేందో తెలుసు. కానీ ఎందుకో భయపడుతున్నరు. కేసీఆర్ పాలన ఉండేది 5 నెలలే. ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయే.

• ఆర్టీసీ కార్మికుల సమస్యల సమస్యలను పరిష్కరిస్తా. ఆర్టీసీని విలీనం చేసే అంశంపై మా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.

• సమ్మె సమయంలో చనిపోయిన కార్మిక కుటుంబాలన్నింటినీ ఆదుకుంటాం. ఆర్టీసీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటాం.

• తెలంగాణ ఉద్యమ సమయంలో మీరంతా 50 రోజులపాటు సమ్మె చేశారు. కేసీఆర్ కుటుంబం మీ జెండా పట్టుకుని అధికారంలోకి వచ్చారు.

• తెలంగాణ వచ్చాక మీ పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడింది. పీఆర్సీ లేదు. డీఏలివ్వడం లేదు. జీతాలు పెంచడం లేదు.

• ఆర్టీసీని నష్టాలపాల్జేశారు.. 5 వేల కోట్ల అప్పు ఉందని చెబుతూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నరు. కుక్కను చంపాలంటే పిచ్చి ముద్ర వేసి చంపినట్లుగా లక్షన్నర కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడానికి ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రకు తెరదీశారు.

• ఆర్మూర్ లో బస్టాండ్ కాంప్లెక్స్ ను స్థానిక ఎమ్మెల్యేకు లీజుకిచ్చారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల కిరాయి బకాయిలు కట్టనేలేదు.

ఆర్టీసీ ఆస్తులను బీఆర్ఎస్ నేతలకు లీజుకిస్తూ దోచుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయలకు బెన్ ఫిట్స్ వస్తున్నాయే తప్ప కార్మికులకు మాత్రం బెన్ ఫిట్స్ ఇవ్వడం లేదు.

• బీఎంఎస్ ఫేరు చెబితేనే భయపడే పరిస్థితి. బీఎంఎస్ ఎవరికీ భయపడదు. కార్మికుల కోసం కొట్లాడతదని తెలిసి ఎదగకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది.

• ఆర్టీసీ కార్మికులందరికీ కోపంగా ఉంది. సంస్థను నిర్వీర్యం చేయడంతోపాటు జీతాలు, బెన్ ఫిట్స్, డీఏలు ఇవ్వడం లేదు.

• నాకు బస్సుమీద ప్రేమ ఉంది. చిన్నప్పుడు ఆర్టీసీలో తిరిగే వాడిని. పేదలకు అండగా ఉండేది. కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండేది.

లోన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. లోన్లు కూడా ఇవ్వడం లేదు. కోరితెచ్చుకున్న తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గౌరవంగా బతకలేని స్థితికి తీసుకొచ్చారు.

• అనుకూలమైన వాళ్లను సంఘాల నాయకులుగా నియమించుకుని సమస్యలపై కొట్లాడేవారిని బెదిరిస్తున్నారు. ప్రజలను కలవరు, ఆర్టీసీ సమస్యలపై స్పందించరు.

ఆర్టీసీ బస్సులు రోడ్డుమీద ఆగుతున్నా పట్టించుకోరు. ఏం చెప్పినా ఫోటో తీసి వాట్సప్ పెట్టమంటున్నరు. మరి కేసీఆర్ రోజూ పని చేయకుండా తాగుతున్నరు. పని చేస్తున్నట్లు నటిస్తున్నరు. ఇకపై ఆయన కూడా తాగే ఫోటోలను వాట్సప్ లో పంపిస్తారా?

• కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. టెన్షన్ లో ఉన్నారు. ఉద్యోగాలు పోతాయనే భయంతో ఉన్నారు.. మీరంతా భయపడకండి.

మీ వెంట మేమున్నాం. కలిసి కొట్లాడండి. ఉద్యోగాలు పోతే మేమున్నాం. 5 నెలల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం.

• ఆర్టీసీ సమ్మె చేసే సమయంలో నేను అండగా ఉన్నా… బీజేపీ నాయకులంతా సమ్మెలో పాల్గొని ఆందోళన చేశాం. కార్మికుడు బాబు చనిపోతే ఆ కుటుంబానికి అండగా పోరాడినం.

ఆరోజు మంద క్రిష్ణ కాలు విరిగి బాధపడుతుంటే ఓ ఇంట్లో ఉంచితే.. పోలీసులు ఆ ఆశ్రయమిచ్చిన వ్యక్తిని బెదిరించారు.

బాబు అంతిమ యాత్రలో పాల్గొంటే.. పోలీసులు మారువేషంలో వచ్చి బాబు శవాన్ని ఎత్తుకుపోయి లాఠీఛార్జ్ చేశారు. కాళ్లు చేతులు విరిగిన కార్మికులు కూడా చెప్పుకోలేని దుస్థితి నెలకొంది.

• ఆర్టీసీ కార్మికులు ఇయాళ బిక్కుబిక్కుమనే పరిస్థితి. కష్టాలు చెప్పుకుందామంటే పట్టించుకునేవాళ్లు లేరు. ఆఫీసర్లు బీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మాలా మారారు.

• ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే సర్కార్ కు చుక్కలు చూపించొచ్చు. విద్యుత్ కార్మికులు సమ్మె మొదలు పెట్టారు.

పంచాయతీ రాజ్ కార్యదర్శులు సమ్మె స్టార్ట్ చేశారు. ఉద్యోగుల సమస్యలే కాదు చివరకు మెడికల్ ట్రీట్ మెంట్ కు కూడా డబ్బులివ్వని దుర్మార్గుడు కేసీఆర్.

• ఒవైసీపై కేసీఆర్ ప్రేమకు చిహ్నమే నూతన సచివాలయం. ఆయన ప్రేమకు తగ్గట్టే కట్టారు. రాయబారులు కాంగ్రెస్, కమ్యూనిస్టులు.

ఆ బానిస చిహ్నాలను తొలగిస్తానన్నానే తప్ప సచివాలయాన్ని కూలుస్తానని నేను చెప్పలేదు. కొన్ని టీవీ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సరిదిద్దు కోవాలని కోరుతున్నా.

తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, బలిదానాలకు చిహ్నంగా నిర్మించాల్సిన సచివాలయాన్ని ఒవైసీ కోసం కడతారా?

• ప్రశ్నిస్తే మేం కూలగొట్టేవాళ్లం… కేసీఆర్ కట్టేవాడని ప్రచారం చేస్తున్నరు. సిగ్గుండాలే జాతీయ రహదారులు సహా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివ్రుద్ది నిధులన్న కేంద్రానివే… చాలా అభివ్రుద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకుండా అభివ్రుద్ధిని అడ్డుకుంటున్న మూర్ఖుడు కేసీఆర్.

• ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే కూడా బెన్ ఫిట్స్ ఇవ్వలేని మూర్ఖుడు. జీతాలు, పెన్షన్ పైసలు కూడా సక్రమంగా చెల్లించలేని మూర్ఖుడు. తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పు భారం మోపాడు. ఆర్ధికంగా దివాళా తీయించిండు.

• ఉచిత కరెంట్ బకాయిలు రూ.60 వేల కోట్లు చెల్లించకుండా డిస్కంలను సంక్షోభంలోకి నెట్టారు. సింగరేణిని దివాళా తీయించి కేంద్రం మూసివేయించే కుట్రకు పాల్పడుతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రైవేటీకరణ సాధ్యమా? సింగరేణిని ఏటీఎంలా వాడుకుంటున్నడు.

• ఆర్టీసీ కార్మికులెవరూ భయపడొద్దు. ఆర్టీసీని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఆర్టీసీలో పనిచేయడం గొప్ప గౌరవం అయ్యేలా తీర్చిదిద్దుతాం.

ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. భయపడితే మిమ్ముల్ని కేసీఆర్ మరింత భయపెడతారు. మీ పిరికితనం చూసి మీ కుటుంబాటు కూడా భయపడే దుస్థితి ఏర్పడింది. మీరు మీ సమస్యలపై కొట్లాడండి.

మిమ్ముల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఒకవేళ ఉద్యోగాల నుండి తీసేస్తే 5 నెలల తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. లాంగ్ లీవ్ తీసుకున్నామని అనుకోండి… అధికారంలోకి రాగానే మళ్లీ మీ అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం.

• సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ కార్మికులంతా బయటకు రండి. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటి కోసం బీజేపీ పోరాడుతోంది. లాఠీలకు, జైళ్లకు, కేసులకు భయపడేదిలేది.

ఆర్టీసీ కార్మికుల కోసం పోరాతాం. మేం సాగిస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కండి. తెలంగాణ సాధనలో మీరు చూపిన తెగువను మరోసారి ప్రదర్శించండి.

మీ త్యాగాలు, పోరాటాల ద్రుశ్యాలను, ఆ ఉద్యమంలో బలైన ఉద్యోగుల కుటుంబాల బాధలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ధైర్యాన్ని తెచ్చుకోండి.

తెగించి కొట్లాడండి. టైర్లను రోడ్లపై తిప్పండి. కేసీఆర్ సంగతి చూసే బాధ్యతను మేం తీసుకుంటాం. అందరం కలిసి చరిత్రను తిరగరాస్తాం… మాతో కలిసి రండి.

• మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత బంధులో 30 శాతం కమీషన్లు దొబ్బుతున్నరని సీఎం కేసీఆర్ చెబుతున్నడు.

మరి నువ్వెందుకు అడ్డుకోలేదు. కమీషన్లు తీసుకున్నోడి వద్ద సొమ్మును రికవరీ చేసి లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్లపై ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడం లేదు? దళిత బంధు కమీషన్ల పేరుతో మంజూరైన 10 లక్షల్లో 9 లక్షలు గుంజుకుంటున్నారు.

324 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?