
బొగ్గు లారీ ఢీ.. పల్టీలు కొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా
చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్..
*బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు..
*భద్రాచలం డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం…
*క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు…
కొత్తగూడెం పట్టణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
టీఎస్‌ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి 47 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు విజయవాడ బయల్దేరింది.
చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద రోడ్డుకు అడ్డంగా బొగ్గు లారీ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది.
బస్సులోని ప్రయాణికుల్లో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకు చెందిన వారు ఉన్నారు.