
GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి
GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. కళాసిగూడలో ఇవాళ ఉదయం ఆ పాప… పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
కానీ తిరిగి రాలేదు. ఏమైపోయిందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. పాప కోసం వెతుకుతుండగానే…
పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని DRF సిబ్బంది కనిపెట్టారు. మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిందని తెలిసింది. పాపను నాలుగో తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు.
ప్రతీ సంవత్సరం ఇదే తంతు. ఎవరో ఒకరు మ్యాన్‌హోళ్లలో పడి చనిపోతూనే ఉన్నారు.
GHMC అధికారులు… తెరచివున్న మ్యాన్ హోళ్లను మూసివేయించకుండా.. నిర్లక్ష్యంగా వదిలేస్తుండటంతో… వానలు పడినప్పుడు… వాటిలో పడి చనిపోతున్నారు ప్రజలు.
కళాసిగూడలో వరద నీరు పోవాలని GHMC సిబ్బంది.. ఆ నాలాను తెరచివుంచారు.
కానీ… తెరచివుంచిన విషయంపై వారు హెచ్చరిక బోర్డు పెట్టలేదు. దాంతో పాప అందులో పడి.. కొట్టుకుపోయింది.
తాజాగా ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి.
మరో 3 గంటలు ఇలాగే వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన ఉంది అని తెలిపారు.