
అఫ్జల్‌గంజ్ పీఎస్ పరిధిలో 2 నెలల చిన్నారి కిడ్నాప్
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల పసిపాప కిడ్నాప్‌నకు గురైంది.
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్‌పై ఉంటున్న మహిళ స్వాతి తన రెండు నెలల చిన్నారి ఆడుకుంటుండగా కిడ్నాప్‌నకు గురైందని అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడు ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తూ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అఫ్జల్ గంజ్ పోలిస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల పాప కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్‌నకు పాల్పడ్డ ఓ మహిళతోపాటు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పుగూడ రైల్యే స్టేషన్ నుంచి వేరొక ప్రాంతానికి తరిలిస్తున్న సమయంలో ఇద్దరి నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన మహిళ మహరాష్ట్ర, యువకుడు జార్ఘండ్ ప్రాంతాన్నికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే.. ఉస్మానియా ఆస్పత్రి విశ్రాంతి గది ఫుట్‌పాత్‌పైన నిద్రిస్తున్న ఓ యాచకురాలికి చెందిన రెండు నెలల పసిపాపను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.
ఈ సంఘటన గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. మాల్ ప్రాంతానికి చెందిన స్వాతి బతుకుదెరువు కోసం అఫ్జల్‌గంజ్‌కు వచ్చి కొంతకాలంగా ఫుట్‌పాత్‌పై యాచిస్తూ జీవనం సాగిస్తోంది.
ఆమెకు రెండు నెలల పసిపాప ఉంది. ఉస్మానియా ఆస్పత్రి ఫుట్‌పాత్‌పైనే ఆమెతోపాటు పడుకుంటోంది. మూడు రోజులుగా 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ, 20 ఏళ్ల యువకుడు అదే ఫుట్‌పాత్‌పై ఉంటున్నారు. దీంతో వారు పాపను ఎత్తుకుంటూ సన్నిహితంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి స్వాతి కూతురును తన ఒడిలో పెట్టుకుని నిద్రపోతుండగా, గుర్తు తెలియని మహిళ, యువకుడు పాపను మెల్లగా తీసుకుని ఉస్మానియా ఆస్పత్రి విశ్రాంతి గది నుంచి అఫ్జల్‌గంజ్ బస్టాండ్ వరకు చేరుకున్నారు. అక్కడ ఆర్టీసీ డ్రైవర్ బాలయ్యను ఫలక్‌నుమాకు వెళ్లే బస్సు ఇక్కడకు వస్తుందా.. అని అడిగారు.
ఇక్కడి నుంచి ముందుకు వెళ్లాలని ఆయన సూచించగా వారు వెళ్లారు. అరగంట తర్వాత నిద్ర నుంచి మేల్కొన్న స్వాతి పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది.
మూడు రోజులుగా తన వెంట ఉన్న వారు కూడా కనిపించకపోవడంతో బయటకు తీసుకెళ్లారని తొలుత భావించింది. సమయం గడిచినా వారు రాకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని ఆస్పత్రి, అఫ్జల్‌గంజ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగానే పాపను సురక్షితంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించారు.