ఎమ్మెల్యేతో యువతిలా చాటింగ్.. డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులు

Spread the love

ఎమ్మెల్యేతో యువతిలా చాటింగ్.. డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓ వ్యక్తి నగదు కోసం బెదిరించిన ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజమాబాద్‌కు చెందిన ఎండీ ఇషక్ అనే వ్యక్తి ఈ నెల 23 న బెల్లంపల్లి ఎమ్మెల్యేకు సాధారణ, వాట్సప్ సందేశాలు పంపించాడు.
అదికూడా ఓ యువతిలా చాటింగ్ చేశాడు. తనకు 90 వేల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు.

ఇటీవల ఆ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, ఆరిజిన్ డెయిరీ యాజమాన్యానికి గోడవలు జరిగాయి.

అయితే వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ ఇషక్ బెదిరించాడు. చివరి ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు మమోదు చేసుకున్న పోలీసులు యువతిలా చాట్ చేసిన వ్యక్తిని ఇషక్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

2,930 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?