
దళిత బంధు..గొర్రెల పంపిణీ లో సర్పంచ్ భర్త చేతి వాటం?
గొర్రెల షేడ్ ల నిర్మాణం లో నేరేడు చర్ల లో ఓ ఐరన్ దుకాణం లో షేడ్ నిర్మాణం కోసం కొంత నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులు…
షేడ్ నిర్మాణం కు సరిపోను సామాగ్రికి డబ్బులు పోను ఇంకా షాపు యజమాని వద్ద మిగిలిన లబ్ధిదారుల డబ్బులు
దుకాణం యజమాని దగ్గర నుండి లబ్ధి దారుల డబ్బులు కాజేసిన సర్పంచ్ భర్త అంటూ ఆరోపణలు
ఒక్కొక్క లబ్ధిదారుల నుండి లక్ష డిమాండ్ చేసిన సర్పంచ్ భర్త అని ఆరోపణలు
50 వేలు చెల్లిస్తే మరో 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సర్పంచ్ భర్త… ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్
పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే గొర్రెల యూనిట్ల అమ్మకాలు కు సహకారం? లేదంటే కదిలేది లేదు అమ్మేది లేదు?
ఇప్పటికే గొర్రెల యూనిట్లు మంజూరు కావడం..అమ్మకాలు కూడా జరిగినట్లు స్థానికులు ఆరోపణలు
సూర్యాపేట జిల్లా పాల కీడు మండలం కోమటికుంట గ్రామంలో ఒక్క లబ్ధిదారుడు నుండి లక్ష రూపాయలు సర్పంచ్ భర్త వసూళ్ల కు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
లక్ష రూపాయలు లో సగం చెల్లిస్తే మరో 50 వేల రూపాయలకు ప్రాoసరి నోటు రాయించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు..
ఈ విషయం బయటకు ఎవరైనా చెప్పితే పది లక్షలు ఇచ్చేటట్టు అని కాగితాలు రాయించు కొన్న సర్పంచ్ భర్త అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు..
గొర్రెల యూనిట్స్ 15 మంది ( పూర్తిగా పది లక్షలు రాలేదు అమౌంట్ ఎంత ఉన్నాయన్నదీ చెప్పటంలేదు )సర్పంచ్ భర్త, ఎంపీడీఓ అని కొందరు ఆరోపిస్తున్నారు,,
ట్రాక్టర్,2 డోజర్ 1
జేసీబీ 3 యూనిట్స్ కలిపి
బోలోరో ట్రాక్కు 3
ఫొటో స్టూడియో 1
చెప్పుల షాప్ 1
బట్టల షాప్ 1
సెంట్రింగ్ 1
ఆటో 1 సగం గోర్లు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు..
ఒక వృద్ధురాలికి గొర్రెల యూనిట్ మంజూరు అయితే దానికి సంబంధించి 50 వేలు చెల్లించిందట ? ఆ వృద్ధురాలు మిగిలిన 50 వేలు ఇవ్వలేను అని సర్పంచ్ భర్తకు చేపిందట? అయితే ఆ సర్పంచ్ నువ్వు గొర్రెలు ఎలా అమ్ముతావో చూస్తా అని ఆ వృద్ధురాలిని అడిగే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది..
నిన్న నే ముఖ్యమంత్రి kcr సార్ దళిత బందులో చేతి వాటం ప్రదర్శించారని కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే లు 3 లక్షల వరకు నొక్కారని బహిరంగ గానే అన్నారు…
ఆయన చెప్పిన కొందరు నేతలు బుద్ది మారడం లేదు..
అయిన తల్లి చేలో మేస్తే …పిల్ల గట్టున మేస్తదా?
బాసు బీరు సీసాలు టాక్స్ వసూళ్లు…శిష్యులు గొర్రెల టాక్స్
మరి ఏలే వారికే ఎరుక.. ఆ జాన్ పహాడ్ సైదన్న సాక్షిగా!