ఏసీబీ వలలో డిప్యూటీ కమిషనర్

Spread the love

ఏసీబీ వలలో సౌత్​జోన్​ జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్

​పాతబస్తీ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం రూ.2వేలు లంచం తీసుకుంటున్న సౌత్​ జోన్​ జీహెచ్​ ఎంసీ సర్కిల్​ 8 డిప్యూటీ కమిషనర్​ రిచాగుప్తను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

రూ. 4 లక్షల సివిల్​ కాంట్రాక్ట్​ వర్క్​ నిధులు మంజూరుకు రూ.2వేలు​ డిమాండ్​ చేయడంతో బాధితుడు సివిల్​ కాంట్రాక్టర్​ ఉమర్​ ఆలీఖాన్​ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఆమె నేరుగా తీసుకోకుండా ఆయనకు మధ్యవర్తిత్వం వహించిన ఆమె అసిస్టెంట్​ , కంప్యూటర్​ ఆపరేటర్​ సతీష్​ ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

వివరాలలోకి వెళితే … హైదరాబాద్​కు చెందిన సివిల్​ కాంట్రాక్టర్​ ఉమర్​ ఆలీఖాన్​ రూ.4 లక్షల సివిల్​ కాంట్రాక్ట్​ వర్క్​కు నిధులు మంజూరుకు సౌత్​ జోన్​ జీహెచ్​ ఎంసీ సర్కిల్​ 8 డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ​ రిచాగుప్త ను ఆశ్రయించాడు.

ఆమె బిల్లులు త్వరగా రావాలంటే కమిషన్​ కింద రూ.2వేలు తన అసిస్టెంట్​, కంప్యూటర్​ ఆపరేటర్​ సతీష్​కు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో సదరు సివిల్​ కాంట్రాక్టర్​ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అప్పటి నుంచి ఏసీబీ అధికారులు రెక్కీ నిర్వహిస్తున్నారు. రూ. 2 వేలు తీసుకువచ్చానని బాధితుడు డిప్యూటీ కమిషనర్​కు కాల్​చేయగా కంప్యూటర్​ ఆపరేటర్​ సతీష్​కు ఇవ్వాలని సూచించింది.

రిచాగుప్త సూచనల మేరకు సతీష్​కు రూ.2 వేలు కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా అదుపులోకి తీసుకున్నారు.

4,878 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?