
సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్..!
ప్రేమే జీవితమనుకుని, లవ్ ఫెయిల్ అయితే ఇక లైఫే లేదనే అపోహలో చాలా మంది యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలుస్తున్నారు.
ముఖ్యంగా యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
ప్రేమికురాలు తన ప్రేమను అంగీకరించలేదని, లేదంటే లవ్‌లో గొడవలు పడి విడిపోవడం, వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడం ఆత్మహత్యలకు కారణాలు అవుతున్నాయి.
ప్రేమ విఫలం అయితే కొంత మంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుని ముందుకు సాగుతుండగా.. మరి కొందరూ తీవ్రంగా తీసుకుని మద్యానికి బానిస కావడమో లేదంటే అఘాయిత్యాలకు ఒడిగట్టడమే చేస్తున్నారు.
సరిహద్దులో ఎంతో కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొని విధులు నిర్వహించే జవాన్..ప్రేమకు బలయ్యాడు.
హైదరాబాద్ బేగంపేటలో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
సీఆర్‌పీఎఫ్ జవాన్ ఐజీ లడ్డా ఇంట్లో ఈ ఘటన జరిగింది. సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని దేవేందర్ కుమార్ అనే జవాన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే అతడి ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమని తెలుస్తోంది. మృతుడు చత్తీస్ గఢ్‌కు చెందిన జవాన్. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.