
ట్రాక్టర్ బోల్తా… డ్రైవర్ మృతి
జూలూరుపాడు : మండల పరిధిలోని సూరారం గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ వంశీ (25) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ సంఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూరారం గ్రామానికి చెందిన మాలోత్ వంశీ గత కొంతకాలంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వేసవి దుక్కులు దున్నేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ వంశీ ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు.
దుక్కి దున్నేందుకు డ్రైవర్ ఒక్కడే వెళ్లడం, సమీపంలోని పొలాల్లో కూడా ఎవరూ లేకపోవటంతో ప్రమాద సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న సూరారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాక్టర్ కింద పడి ఉన్న వంశీ మృతదేహాన్ని బయటకు తీశారు.
2,996 Views