
విషాదం
మావోయిస్టుల ఘాతుకం.. 10మంది పోలీసులు మృతి
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సుపై మందుపాతర పేల్చారు.
ఈ ఘటనలో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు పోలీసులు లక్ష్యంగా భారీ పేలుడుకు పాల్పడ్డారు.
దంతెవాడ జిల్లాలో అరాన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో మొత్తం 11 మంది పోలీసులు చనిపోయినట్లు సమాచారం.
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టులకు పెట్టనికోటగా ఉంటున్నాయి.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి తగ్గింది. అయితే అదును కోసం చూస్తున్న మావోయిస్టులు ఈ పేలుడుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంప్రూవైడ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ) బ్లాక్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో మావోలు ఈ దాడి చేశారు.
ఈ దాడిలో 10 మంది పోలీసులతో పాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ మరణించారు.