డ్రంకెన్‌ డ్రైవ్‌’ పరీక్షలకు సహకరించని డ్రైవర్‌

Spread the love

మద్యం మత్తులో బ్రీత్‌ ఎనలైజర్‌తో పరార్‌

డ్రంకెన్‌ డ్రైవ్‌’ పరీక్షలకు సహకరించని డ్రైవర్‌


డోరు పట్టుకుని 50 మీటర్లు వెంబడించిన కానిస్టేబుల్‌


వేగం పెంచడంతో కింద పడి స్వల్ప గాయాలు


డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలకు సహకరించకుండా ఓ మందుబాబు హల్‌చల్‌ చేశాడు.

బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని కారులో పారిపోయాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్‌ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేట జంక్షన్‌ వద్ద ఏఎ్‌సఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వేగంగా వస్తున్న ఓ కారును(స్విఫ్ట్‌ డిజైర్‌ మోడల్‌) కానిస్టేబుల్‌ లింగారెడ్డి ఆపి బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు దగ్గరకు వెళ్లాడు.

మద్యం మత్తులో ఉన్న కారులోని వ్యక్తి కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని కారుని ముందుకు నడిపేందుకు ప్రయత్నించాడు.

నిందితుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్‌ లింగారెడ్డి కారు డోరు పట్టుకుని సుమారు 50 మీటర్ల దూరం వెళ్లాడు.

అయినా డ్రైవర్‌ కారు వేగం పెంచడంతో కింద పడిపోయిన కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లింగారెడ్డితో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్‌ వాహనంలో వెంబడించారు.

ఇది గమనించిన కారు డ్రైవర్‌ ఏపీ రాష్ట్రం గుంటూరు వైపు కారులో పారిపోయాడని సీఐ తెలిపారు. అతడిపై కానిస్టేబుల్‌ లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐ తెలిపారు.

1,902 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?