
హైదరాబాద్ బోరబండలో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు!
ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు.
ప్రతిరోజు ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో మహిళలపై లైంగిక వేధిలపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల కొంతమంది ప్రేమోన్మాధులు యువతులపై దాడులు చేయడం..
చంపడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ ప్రేమోన్మాధి రెచ్చిపోయాడు.. తన ప్రేమను కాదన్న కోపంతో యువతి గొంతు కోసిన ఘటన హైదరాబాద్ లో బోరబండలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ బోరబండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారా నగర్ లో కిషోర్ అనే ప్రేమోన్మాధి కొంత కాలంగా లక్ష్మీ అనే యువతి వెంట పడసాగాడు. కానీ లక్ష్మీ మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తూ వచ్చింది. తన ప్రేమను కాదన్న కోపంతో యువతిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు కిషోర్.
ఈ క్రమంలో యువతి స్కూటీపై వస్తున్నసమయంలో ఆమె కళ్లలో కారం కొట్టి కత్తితో దాడికి దిగాడు. కిషోర్ దాడిలో యువతి గొంతుపై, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధతో ఆ యువతి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సురేష్ ని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
తీవ్ర గాయాలతో ఉన్న యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కిషోర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.