
బాయిలో పడ్డ బాలిక.. కాపాడేందుకు దిగిన యువకుడు.. ఇద్దరూ మృతి
నల్గొండ దేవరకొండ టౌన్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పీర్లబాయిలో ఇద్దరు మృతి చెందారు.
బావిలో ప్రమాదవశాత్తు పడిన జ్యోతి అనే బాలికను కాపాడే క్రమంలో నాగరాజు అనే యువకుడు బావిలోకి దూకాడు.
బాలికను కాపాడే ప్రయత్నం చేశాడు.
అయితే, ఈ ప్రయత్నంలో ఇద్దరూ నీటమునిగి మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు..
స్థానికుల సాయంతో బాధితుల మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
1,656 Views