
ఆటో బోల్తా పడి కూలీలకు గాయాలు..
మరిపెడ మండల కేంద్రంలో ఖమ్మం, వరంగల్ హైవేపై ఆటో బోల్తా పడి ఐదుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాలు ఇలా ఉన్నాయి. మరిపెడ మండలం వీరారం గ్రామంలో మిరప చేనులో మిరపకాయలు వేరేందుకు
కూలీ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఖమ్మం వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఆగి ఉన్న కారును ఢీకొనగా అదుపుతప్పి రోడ్డు మధ్యలోకి దూసుకురావడంతో ఆటోకి తగిలి బోల్తా పడింది.
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
కూలీల స్వగ్రామం తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామం.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
2,496 Views