
సిద్ధిపేట లోని సోనీ రెస్టారెంట్లో జరిగిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయట ఫుడ్డు తినాలంటే జనాలు భయపడుతున్నారు.
అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. సిద్దిపేటలో సోనీ రెస్టారెంట్ కి వెళ్ళిన ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, టాయిలెట్ లోకి వెళ్ళాడు.
ఇక కస్టమర్ టాయిలెట్ కు వెళ్లేసరికి అక్కడ స్టాప్ టాయిలెట్ లోనే బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు. ఏకంగా లెట్రిన్ కమోడ్ పక్కన బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని పిలిచి చెడామడా తిట్టి పోశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే మోటర్ కాలిపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం ఉందని, అందుకే ఇక్కడ బియ్యం కడుతున్నారని సమాధానం చెప్పారు.
ఇక రెస్టారెంట్ వారు చెప్పిన సమాధానం విన్న కస్టమర్ ఇది మీ తప్పు కాదు ఇక్కడ తినడానికి వచ్చిన మాదే తప్పు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంట్లో ఎంత బాగా వంట చేసినా ఇంట్లో తినకుండా బయట తినాలని ప్రతిరోజు పరుగులు తీసే వారు, ఒక నిమిషం ఆగి ఈ వీడియో చూసిన తర్వాత బయట బిర్యానీలు తినడానికివెళ్లొచ్చు