
కన్నీరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం వద్ద ప్రమాణం చేసిన తర్వాత ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. తాను ఎవరికి అమ్ముడుపోనని అన్నారు.
రేవంత్ రెడ్డి గద్గర స్వరంతో కన్నీరు పెట్టడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాళ్లు విసురుకోవడంపై విజయశాంతి స్పందించారు. విపక్ష నేతల ఛాలెంజ్‌లు బీఆర్‌ఎస్‌కు వేడుకలు అవుతున్నాయని ఆమె అన్నారు
దుర్మార్గ వ్యవస్థపై పోరాడటం మన కర్తవ్యమని పిలుపునిచ్చారు.
రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవద్దని విజయశాంతి సూచించారు.
కాగా.. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బులు తీసుకునే ఖర్మ పట్టలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.25 కోట్లు తీసుకోలేదని దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, ఈటల సిద్ధమా అని సవాల్ విసిరారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు తాను భాగ్యలక్ష‍్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలన్నారు. లేదా ఈటల ఏ గుడికి రమ్మంటే తాను అక్కడకు వెళ్లేందుకు సిద్ధమన్నారు.
ఈ సవాళ్ల నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపైఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు.
తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ.. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందని ఆమె వరుస ట్వీట్‌లు చేశారు.