
పది జవాబు పత్రాలు దిద్దుతూ ఉపాధ్యాయుడు మృతి
ఇంకొల్లు మండలంలోని పూసపాడు గ్రామానికి చెందిన బోడావుల శ్రీనివాసరావు (47) గురువారం బాపట్లలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలు దిద్దుతూ రక్తపోటు అధికమై మృతి చెందాడు.
బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూలులో జరుగుతున్న మూల్యాంకనానికి హాజరై పరీక్ష పేపర్లు దిద్దుతున్న సమయంలో ఒక్కసారిగా పడిపోవడంతో తోటి సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు.
ఆ సమయంలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు. పర్చూరు గ్రామంలోని వైఆర్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
635 Views