
కేసముద్రం తాసిల్దార్ గుండెపోటుతో మృతి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తాసిల్దార్ ఫరీద్ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు
కేసముద్రం మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందులో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో అస్వస్థకు గురయ్యారు
వెంటనే కేసముద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు తాసిల్దార్ మృతి పట్ల రెవిన్యూ శాఖలో విషాదఛాయలు అమ్ముకున్నాయి
9,777 Views