
జమ్మూకాశ్మీర్‌లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం
జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. జమ్ము-పూంఛ్ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
4,369 Views