
మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. వ్యక్తిపై దుండగులు గన్ తో ఫైరింగ్
కరీంనగర్ జిల్లా మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. అరుణ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు గన్ తో కాల్పులు జరిపారు.
గన్ మిస్ ఫైర్ కావడంతో అరుణ్ తప్పించుకున్నారు. అయితే ఆయన కూతురు వైష్ణవికి గాయాలు అయ్యాయి. రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకుని దగ్గర్లోని ఓ ఇంటికి చేరుకుని అరుణ్ ప్రాణాలు కాపాడుకున్నారు.
అయినా దుండగులు విడిచి పెట్టలేదు. అరుణ్ తలదాచుకున్న ఇంట్లోకి వెళ్లి వారిని చితకబాదారు.
గొడవకు ఎలాంటి సబంధం లేని వారి ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేశారు.
ఇంట్లో వారిని ఆయుధాలతో బెరించారు. స్థానికుల సమాచారంతో మానకొండూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
నిందితులకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులతో మానుకొండూరులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.