
ఏసీబీ వలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి
వికారాబాద్ : విద్యా మౌలిక వసతుల కల్పన (టిఎస్ ఈడబ్ల్యూఐడిసి) శాఖలో సైట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే నవాబ్ పేట్ మండలం, మాదారం గ్రామం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద సివిల్ కాంట్రాక్టర్ ముష్టి ప్రభు కొన్ని రిపేరింగ్ పనులు నిర్వహించాడు.
ఇట్టి పనులకు సంబంధించి ఎస్టిమేషన్ వేయడానికి గాను విద్య మౌలిక వసతుల కల్పన శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ పనిచేస్తున్న సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్, ప్రభు దగ్గర నుండి ఇదివరకే రూ.51 వేలు లంచం తీసుకున్నాడు.
ఇదే కాకుండా మరింత అమౌంట్ కావాలని గత కొన్ని రోజులుగా కాంట్రాక్టర్ ప్రభుపై ఒత్తిడి తేవడంతో చేసేది లేక చివరికి ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు గల పరిగి రోడ్డులో ప్రభు నుండి రూ.5000 లంచం తీసుకుంటుండగా ఇర్ఫాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
పంచనామా అనంతరం ఇర్ఫాన్ అరెస్టు చేసి, రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని వెల్లడించారు.
ఈ లంచం డిమాండ్ వ్యవహారంలో ఇర్ఫాన్ మినహా సంబంధిత శాఖ అధికారుల ప్రమేయం ఎవరిది లేదని డి.ఎస్.పి సూర్యనారాయణ వెల్లడించారు.