
జైలు నుంచి విడుదల అనంతరం పార్టీ పెరు ప్రకటించిన తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న ఈ పేరు గురించి తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బెల్లితెరపై వచ్చిన తీన్మార్ ప్రోగ్రామ్ తో బాగా పాపులర్ అయిన మల్లన్న తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రభుత్వంపై తనదైన శైలిలో ప్రశ్నించడం మొదలు పెట్టారు.
సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.
తెలంగాన సర్కార్ పై తీన్మార్ మల్లన్న పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో ఆయన కొత్త పార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. గత నెల 21 న తీన్మార్ మల్లన్నపై పలు సెక్షన్ల కింద మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లన్నకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నను చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన తరుపు లాయర్లు బెయిల్ కోసం కోర్టుకు అప్పీల్ చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.
నిన్న మల్కాజ్ గిరి న్యాయస్థానంలో మల్లన్న తరుపు న్యాయవాది మరోసారి బెయిల్ పిటీషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు మల్లన్నకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్నను కలిసేందుకు అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. తనకోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులకు అభిమాదం చేస్తూ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పోలీసు సెక్షన్లు నమ్మితే.. తాము వీకర్ సెక్షన్స్ తో ఉన్నామని చెప్పారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని.. పార్టీ పేరు ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ అని తెలిపారు.
మల్లన్నతో పాటు క్యూ న్యూస్ కొంతమంది స్టాఫ్ కి కూడా బెయిల్ మంజూరీ చేసింది. ఈ క్రమంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20 వేల ష్యూరిటీ పూచికత్తు తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల పాటు ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట మద్యలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరు కావాలని షరతు విధించింది.