
హరితహారం మొక్కలు నరికినందుకు యజమానికి 1,00,070 జరిమానా
గతంలో విధించిన సుమారు ఆరు లక్షల రద్దు పరచిన గ్రామపంచాయతీ, పాలకవర్గం
మొక్కలు పెంచి, ఏపుగా పెరిగేంతవరకు నీరు పోసి సాధుతానని గ్రామపంచాయతీకి అగ్రిమెంట్ రాసి ఇచ్చిన కంకర మిల్లు యజమాని
గత నెల 30న చివ్వెంల మండలం రాజు నాయక్ తండాలో హరితహారం పథకంలో 2019 సంవత్సరంలో నాటిన సుమారు 143 మొక్కలను తన కషర్ మిల్ లోకి విద్యుత్ ప్రసారానికి అసౌకర్యం లేకుండా ఉండేందుకు,
ఎటువంటి అనుమతులు లేకుండా నరికివేసిన బాలు స్టోన్ క్రషర్ మిల్లు యజమాని భూక్య బాలుకు గ్రామపంచాయతీ మరియు పాలకవర్గం శనివారం సాయంత్రం ఒక లక్ష 70 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు.
పూర్తి వివరాలలోకి వెళితే…
చివ్వెంల మండలం బిబి గూడెం శివారులో సాయిరాం స్టోన్ క్రషర్స్ అనే క్రషర్ మిల్లు యజమాని మార్చి 30వ తేదీన హరితహారం మొక్కలను నరికి వేశారు.
దీంతో గ్రామపంచాయతీ కార్యదర్శి…. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు ఆరు లక్షల పైగా జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.
గత 16 రోజులుగా జరిమానా చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సదరు మిల్లు యజమాని శనివారం రాజు నాయక్ తండ గ్రామపంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి లక్ష డెబ్బై రూపాయలు చెల్లించేందుకు అంగీకరించడంతో అట్టి జరిమానా స్వీకరిస్తున్నట్లు సర్పంచ్ ఇతర వార్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ మేరకు సంబంధిత క్రషర్ మిల్ యజమాని గ్రామపంచాయతీకి పైసలు చెల్లించడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి రసీదు అందజేశారు…