
ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి పై కేసు నమోదు
మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామం లో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో సందర్భంగా ఆవిష్కరణ పనులలో
నిమగ్నమైన ఎస్సీ కమ్యూనిటీకి చెందిన జై భీమ్ ఆర్గనైజేషన్ వారిని స్థానిక ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం సమయం నుండి వారిని కుల వివక్షతతో దూషించారని
ఈ సందర్భం గా సాయంకాలం సమయంలో విగ్రహావిష్కరణలో భాగంగా జై భీమ్ జండా ఆవిష్కరణ చేస్తుండగా
ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం మాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని జై భీమ్ అంటే ఏంది అని కార్యక్రమం చేపట్టిన వారిపై నానా విధాలుగా కులం పేరుతో దూషించారని
మా మెడలపై ఉన్నటువంటి జై భీమ్ కండవాలని లాగారని కుల వివక్షతతో మమ్మల్ని దుర్భాషలాడారని ఎస్సీ కమ్యూనిటీకి చెందిన జై భీమ్ ఆర్గనైజేషన్ వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై పి లోకేష్ తెలియజేశారు.
4,323 Views