సర్పంచ్‌ కాలర్‌ పట్టి.. నిలదీసిన మహిళా

Spread the love

సర్పంచ్‌ కాలర్‌ పట్టి.. నిలదీసిన మహిళా

వరంగల్ : ఉప సర్పంచ్‌కు తెలియకుండా సర్పంచ్‌ గ్రామ నిధులను డ్రా చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేస్తుండగా..

అక్కడే ఉన్న వార్డు సభ్యురాలిని సర్పంచ్‌ అసభ్య పదజాలంతో దూషించడంతో కోపోద్రిక్తురాలైన ఆమె అతడి కాలర్‌ పట్టుకుని నిలదీసింది
ఈఘటన పర్వతగిరి మండలంలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇస్లావత్‌తండా గ్రామ పంచాయతీ నిధులను ఉపసర్పంచ్‌ పీర్యాకు తెలియకుండానే తన సంతకం ఫోర్జరీ చేసి సర్పంచ్‌ ఇస్లావత్‌ రమేశ్‌ డబ్బులు డ్రా చేశాడు.

దీనిపై పీర్యా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం ఈవిషయమై విచారణ చేపట్టేందుకు ఎంపీఓ.. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు.

కాగా.. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, కార్యదర్శుల వాంగ్మూలం నమోదు చేస్తున్న క్రమంలో సర్పంచ్‌ రమేశ్‌, వార్డు సభ్యురాలు అయిన ఇస్లావత్‌ సావిత్రిని అసభ్య పదజాలంతో దూషించాడు.

సావిత్రి కోపంతో సర్పంచ్‌ కాలర్‌ పట్టుకుని నిలదీసింది. ఈక్రమంలో ఎంపీఓ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని చెప్పి వెళ్లిపోయారు.

అనంతరం సర్పంచ్‌ రమేశ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.

సర్పంచ్‌ రమేశ్‌ ఓ ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తుడిపై పిడిగుద్దులతో దాడి చేశాడు. కాగా.. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సర్పంచ్‌ తన సొంత ఇంట్లో పెట్టుకుని గ్రామస్తులు, సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్నాడని తండావాసులు చెబుతున్నారు.

8,323 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?