
రాజకీయాల్లో అగ్రస్థాయి నాయకులే రాత్రికి రాత్రే పార్టీలు మారుతుంటే దిక్కులేదు. అలాంటిది మండల, గ్రామీణ స్థాయి నాయకులు పశ్చిమ బెంగాల్(West Bengal)లో పార్టీ మారినందుకు తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress)కి చెందిన కొందరు గిరిజన మహిళల(Tribal Women)కు శిక్ష విధించారు.
సమాజంలో ఇంకా అణగారిన వర్గాలు, దిగువ సమాజిక వర్గానికి చెందిన వాళ్లపై ఇంతటి అమానుషంగా ప్రవర్తించడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన గూండాల పనే అంటూ మండిపడుతున్నారు. టీఎంసీకి చెందిన ఆరుగురు మహిళలు బీజేపీ(BJP)లో చేరినందుకు గ్రామంలో కిలో మీటర్ వరకు రోడ్డుపై సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో ఈఘటనపై పూర్తి విచారణ చేపట్టింది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(National Commission for Scheduled Tribes).ఇంతటి అమానవీయంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు సైతం ఫిర్యాదు చేశారు.
అమానుష ఘటన..
వెస్ట్ బెంగాల్ బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఏప్రిల్ 6న బిజెపిలో చేరారు. వాళ్లు పార్టీ మారడం టీఎంసీలోని ఓ వర్గానికి నచ్చలేదు. దీంతో తపన్‌లోని తపన్ గోఫానగర్‌కు చెందిన మార్టినా కిస్కు, షియులీ మార్డి, థక్రాన్ సోరెన్, మాలతీ ముర్ము అనే గిరిజన మహిళలను టీఎంసీకి చెందిన కొందరు మహిళలకు గ్రామంలో నడిరోడ్డుపై దండవత్ పరిక్రమ(సాస్టాంగ ప్రదక్షిణలు) చేయించారు. సుమారు కిలో మీటర్ వరకు మహిళలు జనం చూస్తుండగా రోడ్డుపై సాస్టాంగ ప్రదక్షిణలు చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో వైరల్ ..
నలుగురు గిరిజన మహిళల్ని ఈవిధంగా వేధించడంపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణ ప్రారంభించింది. ఈఘటనపై వెస్ట్ బెంగాల్ పోలీసులకు నోటీసు జారీ చేసింది. మహిళల్ని వేధించిన ఘటనపై వాస్తవాలు రాబట్టాలని ..వారికి అలాంటి శిక్ష వేసిన వారి వివరాలను తెలుపుతూ ఓ నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు గిరిజన మహిళలకు జరిగిన అవమానకర ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు. కమిషన్‌కు లేఖ రాశారు.
విచారణకు ఆదేశం ..
గిరిజన మహిళలకు శిక్ష విధించడంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను మూడ్రోజుల్లో అందజేయాలని ఎన్‌సిఎస్‌టి తెలిపింది. దీనిపై పశ్చిమ బెంగాల్ పోలీసు చీఫ్ నిర్ణీత సమయంలో స్పందించడంలో విఫలమైతే వ్యక్తిగత హాజరు కోసం సమన్లు జారీ చేస్తామని NCST తెలిపింది