
కొత్తపల్లి తహసీల్దార్ ఆపీసులో రైతు సూసైడ్ అటెమ్
కరీంనగర్ శివార్లలో ఉన్న కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.
ఆఫీసు ఆవరణలో పురుగుల మందు తాగిన రైతు సిమెంట్ బెంచ్ పై కూర్చొని అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ అయిలోనిపల్లికి చెందిన అనుగుల మల్లేశ్ (55) అనే రైతు తన భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం గత 13 ఏళ్లుగా ఆఫీసుల చుట్టు తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
తన సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిన మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.
అయితే మల్లేశ్ వద్ద సూసైడ్ అటెమ్ కు గల కారణాలు వివరిస్తూ రాసిన లేఖ కూడా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.
కరీనగర్ ఆసుపత్రి వర్గాలు మల్లేశ్ కు చికిత్స అందించడం ప్రారంభించి కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.