
డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా కొనియాడిన NNHRF పెద్దలు
“భారత్ రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా కొనియాడిన: NNHRF పెద్దలు “
“అంటరానితనంపై అలుపెరుగని పోరాటంలో పరిపూర్ణతాను సాధించే క్రమములో అనేక ఇబ్బందులును ఎదురుకున్నారు.”
PBC న్యూస్ ప్రతినిధి
భారత్ రత్న రాజ్యాంగ నిర్మాణానికి మూల కారకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు గారు మాట్లాడుతూ, దేశ ప్రజలందరికి డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా వారి త్యాగన్ని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో చాలా ముఖ్యమైన ఘట్టాలను వారు అంబేద్కర్ గారి గురించి వివరించారు.
“దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. అంబేద్కర్ జయంతి ఇవాళ.. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తోంది. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు.
అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు,కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్..
కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి. నేడు (ఏప్రిల్ 14) ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తోంది అని నేషనల్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు చెప్పారు.
ఈ క్రమములో 1నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు గారు మాట్లాడుతూ, డాక్టర్. బీ.ఆర్. అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడేలో రామ్ జీ, భీమా బాయి దంపతులకు జన్మించారు.
తండ్రి రామ్ జీ బ్రిటీష్ భారతీయ సైన్యంలో సుబేదార్‌గా పని చేసేవారు. అంబేద్కర్ చిన్ననాటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్ కులానికి చెందిన ఆయణ్ని అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోపెట్టేవారు. ఇలా అగ్రకులాలవారి ఆధిపత్యపోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అక్కడ హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు..
ఈ వివక్షలన్నింటినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్ అత్యధిక మార్కులతో పాసయ్యారు అని జ్ఞాపకం చేశారు.
బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు.
ఎంఏ, పీహెచ్‌డీ, న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. విదేశాలలో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు అని డాక్టర్ ప్రవీణ్ రావు పేరుకొన్నారు.. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టారు.
ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువొక్కటే మార్గమని భావించారు. తనలా అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు అని వారు చెప్పారు..
నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి నిస్వార్ధపరుడు యావత్ దేశంలో కులమతాలకు అతీతంగా అందరు వ్యక్తిగతంగా, ఆర్ధికంగా, సామజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించి నిరంతరం తాను చేసిన కృషిని తరతరాలుగా చెక్కుచెదరని విదంగా అయన పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఉండిపోతుందని అంబేద్కర్ గారి త్యాగమును, దేశంపట్ల ఆయనకు ఉన్న బాధ్యతను మరియు సొంత ప్రజలపట్ల అయనకున్న సమర్పణ జీవితం బహుశా ఇంతవరకు ఎవరిలో చూడలేదు ఇకపై ఇటువంటి అద్భుతమైన వ్యక్తిని చూడలేమని కొనియాడారు.
తన వర్గంలోని ప్రజలకు అంబేద్కర్ చదువు చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపించారు. అంటరానితనంపై పోరాటం చేశారు.. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించారు. 1927లో దళిత జాతుల మహాసభ జరిగింది..
మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కొన్ని వేలమంది వచ్చారు. మహత్ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేద్కర్ ఆ చెరువులోని నీటిని తాగారు, చరిత్రలో అదో సంచలనం అని డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ పేరుకున్నారు.
తదుపరి నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జాన్ కాంతారావు మాట్లాడుతూ, 1931లో రౌండ్‌టేబుల్ సన్నాహాలు సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలిశారు.
తర్వాత స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.
భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి ఆయణ్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు అని తెలిపారు.
ఈ నేపథ్యంలో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ లీగల్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ వెల్పుల కృష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ, తరతరాలుగా బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్..
వారి అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు.
అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. డాక్టర్ అంబేద్కర్ ప్రపంచానికే గొప్ప ఆదర్శంగా తన జీవితం ఉండేలా కష్టపడ్డారని వారు చెప్పారు.
చివరిగా నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సభ్యులు నేషనల్ మీడియా డిప్యూటీ అఫైర్స్ చీఫ్ భూక్యా ఉపేందర్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ గారి జీవితం ఒక చరిత్రగా నిలిచిపోవడం మరియు వారు చేసిన కృషికి జన్మతః మనం కచ్చితంగా ఋణపడి ఉన్నామనే చెప్పాలి అని చెప్తూ, అంబేద్కర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ, వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో..
1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
తర్వాత అంబేద్కర్ తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ ఏ వీసా’లో రాసుకున్నారు. అంబేద్కర్ తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు.
అటువంటి అద్భుతమైన మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి మనకు గొప్ప స్ఫూర్తిగా అయన చెప్పినట్లు మన భావితరాలు నడుచుకునేలా చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత నేటి పౌరులుగా మనపై ఉందని జ్ఞాపకం చేసుకున్నారు.
-డాక్టర్. పీటర్ నాయక్ లకావత్,
ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ అఫైర్స్ చీఫ్, నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్