
మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడికి యత్నం..!
మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్కార్పియో వాహనంలో నగరంలోని బస్వాగార్డెన్ రోడ్డులోని మాజీ మేయర్ సంజయ్ ఇంటికి ఇద్దరు యువకులు వచ్చారు.
వారిని అక్కడే ఉన్న పనివారు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు యువకులు కారుతో సంజయ్ ఇంటి గేటును ఢీకొట్టారు. అక్కడ పని చేసే విల్సన్ గమనించి వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశాడు.
సంబంధిత ఫోర్త్ టౌన్ సిబ్బంది అక్కడికి చేరుకొని కారులో వచ్చిన వారిని ప్రశ్నించారు. అయితే, కారులో వచ్చిన వారిలో ఒకరైన సందీప్ వర్మను పోలీసులు విచారించగా తాను మాజీ మేయర్‌తో బాగానే ఉండే వాడినని, కానీ కొన్ని రోజులుగా ఆయన తన ఫోన్ లిప్ట్ చేయడం లేదన్నారు.
కారణం ఏమిటని అడుగుదామని వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు కారులో వచ్చిన వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.
ఈ దాడి సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సంజయ్‌తో మాట్లాడగా ఫిర్యాదు చేసేది లేదని తెలిపినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.