
దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యే లు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి
జిల్లాలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి
భూకబ్జాలపై బహిరంగ విచారణకు సిద్ధం
స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హార్సింగ్ నాయకులకు సవాల్
pbc న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తో పాటు ఖమ్మం జిల్లాలో అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలవాలని భద్రాది కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య డిమాండ్ చేశారు.
తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లపై అర్హత లేని వాళ్ళందరూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హార్సింగ్ నాయక్ తాను భూకబ్జాలకు పాల్పడ్డానని ప్రకటించారని, ఎవరు భూకబ్జాదారిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకు నేందుకు బహిరంగ విచారణకు డేట్ ఫిక్స్ చేయాలని ఎమ్మెల్యేకు ఆయన సవాల్ విసిరారు.